మాకొద్దు బాబోయ్ జగన్.. సొంత కేడరే దూరం.. ఏపీలో దుమారం..!

జగన్ నాలుగునరేళ్ళ జుగుప్సాకర పాలన చూసి ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ కేడర్ సైతం ఆయనకు దూరంగా జరుగుతున్నారు. ఇదే ఆ పార్టీ అధిష్టానంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఐదేళ్ళ అధికారానికి 151 స్థానాల్లో కట్టపెట్టిన ప్రజకు వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు జగన్ రెడ్డి. తండ్రికి తగ్గ పాలన అందిస్తారని అందరూ భావించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. కక్షపూరిత రాజకీయాలతో.., కేసు మాఫి కోసం కాషాయంతో అంటకాగి విధానం.. చేజేతులారా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు జగన్ రెడ్డి. ఇదే విషయాన్ని జర్నలిస్టులే కాదు.., మేధావులు.., రాజకీయ విశ్లేషకులు సైతం నిత్యం మీడియాలో వినిపిస్తున్న స్వరాల్లోనే అంతర్యం. అందుకే జగన్ పాలన విధానాలను చూసిన రాష్ట్ర ప్రజల రాజశేఖరా.. ఇలాంటి కొడుకును కన్నవేంటయ్య..? అంటూ తలలు బాదుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్ పేరును నిలబెడతాడుకుంటే ఆ పేరునే నేడు ప్రజల గుండెల  నుంచి చేతురాల చెరిపేశారు జగన్. ఇది కచ్చితంగా తన స్వయంకృప అపరాదమే.

జగన్ రెడ్డి పిచ్చి పాలన పరాకాష్టకు చేరింది. ప్రజలకు దిక్కులు పట్టి పారిపోవాల్సిన దుస్ధితి ఏర్పడింది. ఏపీలో మేం ఉండలేం రా.. బాబోయ్ అంటూ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. రాష్ట్రంలో అన్నీ రంగాలు కుప్పకూలిపోయాయి. జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉంటే రాజ బిడ్డ జగన్ రెడ్డి ప్యాలెస్ లో నుంచి బయటకు రారు.   ప్రజలకు మధ్యకు రమ్మంటే పరదాల మాట దాక్కుంటారు. ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి ప్రజా సమస్యలపై స్పందించారా..? అంటే అసలు లేదనే చెప్పాలి.

దీంతో ప్రజలు జగన్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నారు. సొంత కేడర్ చీదరించుకుంటున్నారు. ఈ మధ్య జగన్ రెడ్డి పార్టీ చేపట్టిన సామాజీక సాధికార బస్సు  యాత్రలో అవన్నీ ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కేడరును, నేతలను సైతం అధిష్టానం బ్రతిమిలాడుకుని కార్యక్రమాలకు తీసుకు రావాల్సి వస్తోంది. కేడర్ పరిస్ధితి ఇలా ఉంటే.. ప్రజలు మాత్రం వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేదే లేదు అంటూ కరాఖండిగా చెప్పడం వైసీపీని విస్మయానికి గురిచేస్తోంది.  దీంతో ప్రస్తుతం స్థానిక నేతలకు ఆలోచనలో పడ్డారు. బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా తుస్సుమంది.

అలానే జగనే ఏపీకి ఎందుకు ముఖ్యమంత్రి కావాలో వివరించే కార్యక్రమంలో కూడా ఇవే సీన్స్ రిపిట్ అవుతున్నాయి. దీంతో ప్రజలతోపాటు సొంత కేడర్ కూడా జగన్ కార్యక్రమాలకు దూరంగా జరుగుతున్నారు. జగన్ చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో ప్రజలు, కేడర్ దూరంగా ఉండడంతో కార్యక్రమాలన్నీ వెలవెలాడుతున్నాయి. జగన్ అండ్ కో ఊహించినంత కేడర్, ప్రజల నుంచి ఆధారణ కనపడకపోవడంతో షాక్ గురౌతున్నట్లు సమాచారం.