బస్సు యాత్రతో బొమ్మ కనిపిస్తుందా..?

వైసీపీ సామాజీక సాధికార బస్సు యాత్రలో వర్గ విబేధాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయా? దీంతో అధిష్టానం బుజ్జగింపులు ఫలించడం లేదా..? అంటే అవుననే సమాధానాలు ఆపార్టీ నుంచి వినిపిస్తున్నాయి.

ఏపీలో జగన్ పాలన వైఫల్యాలు ప్రజలకే కాదు..ఆ పార్టీ నేతలకు సైతం శాపాలుగా మారాయి. కేడర్ అయితే నెక్స్ట్ లెవల్ లో మెంటల్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. మా  రాజన్న బిడ్డ.., ప్రజలను, నమ్ముకున్న కేడర్ ను అక్కున చేర్చుకుంటాని జగన్ నమ్మి దశాబ్ధంనరగా ఆయన వెంట నడిచారు. ఆయన కోసం ఆస్తులను కరెన్సీగా మార్చి ఖర్చు చేయడమే కాదు.. కటకటాల పాలు కూడా అయ్యారు. కొందరైతే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చూసి జీవితం దారపోశారు. ఎన్నో ఆశలతో జైల్లో ఉన్న నేరస్తుడిని సైతం సీఎంగా చూసే వరకు నిద్రపోలేదు. ఇప్పుడు ఇదే త్యాగం నమ్ముకున్న వారిని శాశ్వత నిద్రలోకి లాగుతోంది.  వారి త్యాగాలపై పునాదులు వేసుకున్న ఏపీ సీఎం జగన్ .. కేడర్ బలి ధానాలను మరిచారు. ఈ విషయాలు  ఆయన వెంట తిరిగే నేతలు చెప్పుకునే పచ్చి నిజాలు.

పార్టీని ఎంతో కష్టపడి అధికారంలో తీసుకు వస్తే.. దాని వెనుక ఉన్నవారిని మరిచి.. ఆ నలుగురికే అధికారాన్ని పంచడం.. పెత్తనం అప్పగించడం ఏమిటి..? అన్నది నమ్ముకున్న నిలదీస్తున్న అంశం. ఇదంత ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత తాడేపల్లి ప్యాలెస్  వదిలి అలా బయటకు తొంగి చూసిన దాఖలాలు లేవు. కనీసం నమ్ముకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొపెట్టిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మంత్రులకైనా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణం. ఈ చర్చ గడిచిన నాలుగునరేళ్ళుగా వినవస్తున్నదే. ఇవన్నీ వెరసి నేతల మధ్య తీవ్ర అసంతృప్తి ఈ మధ్య ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన సామాజీక సాధికార బస్సు యాత్రలో బయటపడుతోంది.

ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన వైసీపీ బస్సుయాత్రకు కీలక నేతలంతా డమ్మా కొట్టారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి సైతం బస్సు యాత్రలో కనిపించకపోవడంతో పార్టీ వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. కనిగిరిలో బస్సు యాత్రకు రావాలని విజయసాయిరెడ్డి సైతం బాలినేని ఇంటికి వెళ్లి పిలిచినా… ససేమీరా అని చెప్పడం ఆ పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. జగన్ కోసం ఎమ్మెల్యే పదవీని సైతం త్యాగం చేసి.., ప్రకాశంలో వైసీపీ మనుగడ కోసం అహర్నిశలు కష్టించిన బాలినేని.. చివరికి జగన్ వైఖరికీ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని విశ్లేషణలు ఊపందుకున్నాయి.

ఇలా వైసీపీలో వర్గవిభేదాలే కాదు.. నమ్ముకున్న వారు నట్టేట్లో మునిగి విలవిలాడుతున్న జగన్ పట్టించుకోకపోవడంతోనే వైసీపీ కార్యక్రమాలకు ఇలా వెలవెలాడుతున్నాయన్నది వాస్తవం.