prabhas tshirt, Prabhas ఐదేళ్ల క్రితంనాటి టీ షర్ట్ వేసుకుని వచ్చాడా?.. సీతారామం ఈవెంట్‌లో డార్లింగ్ సందడి.. పిక్స్ వైరల్ – prabhas t shirt at sita ramam pre release event

24
1659566079_pic.jpg

[ad_1]

అందమైన ప్రేమకథలు తెరకెక్కించే హను రాఘవపూడి(Hanu Raghavapudi) సీతారామం(Sita Ramam) అనే సినిమాతో ఆగస్ట్ 5న రాబోతోన్నాడు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunalini thakur), రష్మిక మందన (Rashmika Mandanna), సుమంత్ (Sumanth) కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ వచ్చాడు.

ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్ స్టైలీష్‌గా కనిపించాడు. ఎంతో ఫిట్‌గా కనిపించాడు. ఇక రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంత ఆర్భాటంగా ఎంట్రీ ప్లాన్ చేసినా కూడా ప్రభాస్ మాత్రం ఎంతో సింపుల్‌గా వచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్‌ల్ ప్రభాస్ ధరించిన టీ షర్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ టీషర్ట్ గతంలోనే వేసుకున్నాడని తెలుస్తోంది.

ఐదేళ్ల క్రితమే ప్రభాస్ ఈ టీషర్ట్‌ను ధరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు డార్లింగ్ అభిమానులు నాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి ప్రబాస్ తాను ఎంత సింపుల్‌గా ఉంటాడో మరో సారి చూపించాడు. అసలే హీరోలు వాడిన బట్టలను వాడరు. వేల రూపాయలు పెట్టి డిజైనర్ దుస్తులను వేసుకుంటారు.

కానీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లినా కూడా ప్రభాస్ మాత్రం ఎంతో సింపుల్ జీవితాన్నే ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ టీషర్టు తెగ వైరల్ అవుతోంది. నాడు నేడు అంటూ ప్రభాస్ ఫోటోలను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ జేబులో డబ్బులు కూడా పెట్టుకోడట. ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ వద్ద అప్పు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పేశాడు. సీతారామం ఫస్ట్ టికెట్ వంద రూపాయలే అని సుమ చెప్పడం, బిగ్ టికెట్ లాంచ్ చేస్తుండటం.. తన వద్ద డబ్బుల్లేవ్ అని, నాగీ వద్ద ఇందాకే అప్పు తీసుకున్నాను అని చెప్పేశాడు ప్రభాస్.

[ad_2]

24 thoughts on “prabhas tshirt, Prabhas ఐదేళ్ల క్రితంనాటి టీ షర్ట్ వేసుకుని వచ్చాడా?.. సీతారామం ఈవెంట్‌లో డార్లింగ్ సందడి.. పిక్స్ వైరల్ – prabhas t shirt at sita ramam pre release event

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *